రోడ్డెక్కిన విశాఖ ఉక్కు కార్మికులు.. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద టెన్షన్ వాతావరణం

Vizag Steel Plant: విశాఖలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 Sept 2024 2:14 PM IST
High Tension at Visakhapatnam Steel Plant
X

రోడ్డెక్కిన విశాఖ ఉక్కు కార్మికులు

Vizag Steel Plant: విశాఖలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కారు. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితుల రాస్తారోకోతో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా… కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్భందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈరోజు ఉదయం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులంతా రాస్తారోకో నిర్వహించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story