తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. బయటకు రావాలంటే జంకుతున్న జనం

High Temperature In Telugu States
x

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. బయటకు రావాలంటే జంకుతున్న జనం

Highlights

Summer Effect: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. బయటకు రావాలంటే జంకుతున్న జనం

Summer Effect: సూర్య భగవానుడి తాపానికి కర్నూలు అతలాకుతలమవుతోంది. గతానికి భిన్నంగా ఎండలు మండిపోవడంతో జిల్లా వాసులు బాంబేలెత్తిపోతున్నారు.ఇతర ప్రాంతాల కంటే కర్నూల్‌లో భానుడు తన భగ భగ లతో విరుచుకు పడుతన్నాడు.దీంతో గతం‌లో ఎన్నడు లేని విధంగా ఎండలు మండి పోతున్నాయి. రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, బస్సుల కోసం నిరీక్షించే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదిత్యుడు రోజురోజుకి ఉగ్రరూపం దాలుస్తుండటం‌తో కర్నూల్ నగరం నిప్పుల కొలిమి‌లా మారింది.

ప్రతి దినం ఉదయం 8 గంటల నుండే ఎండ తీవ్రత నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. ఉదయం11 గంటలు దాటిన తర్వాత విపరీతమైన వేడి గాలులు నగర వాసులకు పలుకరిస్తున్నాయి. పెరుగుతున్న ఎండలకు తీవ్ర ఉక్కపోతులతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు , ట్రాఫిక్ కూడళ్లలో బస్సుల కోసం, ఆటోలో కోసం నిరీక్షించే ముఖ్యమైన ప్రాంతాలలో ఎండ వేడిమికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.

ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు గతంలో కాస్త కొత్తగా ఆలోచించిన కర్నూల్ మున్సిపల్ అధికారులు.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చలువ పందెళ్లు ఏర్పాటు చేశారు. ఈసంవత్పరం చలువ పందిళ్ళను ఈ ఏడాది మరింత‌గా విస్తరించారు..వాహనదారులు ఎండల బారిన పడకుండా గత మూడేళ్లుగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. సాధారణం కన్నా నాలుగు, అయిదు డిగ్రీల ఉషోనోగ్రతలు నమోదు అవుతున్నాయి. వడ గాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. పగటిపూట వాహనాల పై బయటకు వెళ్లే వారు అవస్థలుపడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని గత మూడు సంవత్సరాల నుంచి కర్నూలు కార్పొరేషన్ అధికారులు చలువ పందెళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

మాములుగా ఎండకాలం వచ్చిందంటే స్వచ్చందంగా చలి వేంద్రాలు, ఉచిత వైద్య శిబిరాలు కొందరు ఏర్పాటు చేస్తుంటారు. కానీ పగటి పూట ఎండలో వాహనాల పై ప్రయాణం చేసే వారికి వేసవి కాలం అంతా నిత్య నరకంగా మారుతుంది..రోజురోజుకీ జనాభా పెరుగుదలతో కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్న నగరాలలో నీడనిచ్చే చెట్లు పూర్తిగా కరవయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ అధికారులు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories