ఏపీలో మరో ఐదురోజుల పాటు ఎండల తీవ్రత.. 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

Weather Report: ఇవాళ రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు.. వడగాల్పుల హెచ్చరికలు జారీ

Jyothi
Published on: 8 April 2024 2:08 PM IST
High Temperature In Andhra Pradesh
X

ఏపీలో మరో ఐదురోజుల పాటు ఎండల తీవ్రత.. 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

Weather Report: ఏపీలో మరో ఐదురోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సగటున 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. అనంతపురం జిల్లా సింగనమలలో రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీలు నమోదైంది. ఇక ఇవాళ రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు.. వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

దాదాపు 120 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుచోట్ల వర్షాలు కూడా పడతాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్లూరి, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

Jyothi

Jyothi

Next Story