Mansas Trust: నేడు మాన్సస్ వారసత్వం పిటిషన్లపై హైకోర్టులో విచారణ

Mansas Trust: సింగిల్ బెంచ్‌ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్లు

Sandeep Eggoju
Updated on: 11 Aug 2021 11:48 AM IST
High Court Hearing on the Mansas Trust Inheritance Petitions Today
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమాజ్)

Mansas Trust: నేడు మాన్సస్ ట్రస్ట్ వారసత్వం పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. సింగిల్ బెంచ్‌ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం, సంచయిత, ఊర్మిళలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. నిబంధనల ప్రకారమే ట్రస్ట్‌ ఛైర్మన్‌గా సంచయితను నియమించామని తెలిపింది ప్రభుత్వం. దేవాదాయశాఖ నూతన చట్టం ప్రకారం వారసత్వం రద్దయిందన్న ప్రభుత్వం.. సింగిల్ బెంచ్ అశోక గజపతి రాజును ఛైర్మన్‌గా నిర్ధారించిన ఆదేశాలు రద్దు చేయాలని కోరింది.

వారసత్వంగా అశోక గజపతిరాజుకు ఛైర్మన్‌గా నిర్ధారించిన ఆదేశాలు రద్దు చేయాలంది ప్రభుత్వం. మాన్సస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా తనను గుర్తించాలని ఊర్మిళ కోరుతుంది. ఆనంద గజపతిరాజు రెండవ భార్య కుమార్తెగా తనకు హక్కు ఉందని తెలిపిందామె. ట్రస్ట్‌ వారసత్వంపై త్రిముఖ పోటీ నెలకొంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story