Mansas Trust: సంచయితకు షాక్.. అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా..

Mansas Trust: మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 14 Jun 2021 2:52 PM IST
High Court Cancels Sanchitas Appointment as Mansas Trust
X

Mansas Trust: సంచయితకు షాక్.. అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా..

Mansas Trust: మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 72 ను హైకోర్టు కొట్టివేసింది. మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం, మాన్సాస్ ట్ర‌స్ట్‌కు అశోక్ గ‌జ‌ప‌తి రాజునే చైర్మ‌న్ గా ఉండేలా ఆదేశాలు జారీచేసింది.

గ‌తంలో మాన్సాస్‌, మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం ట్ర‌స్ట్‌ల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించేవారు. అయితే, ఆయ‌న్ను త‌ప్పిస్తూ ప్ర‌భుత్వం జీవో 72 ను తీసుకొచ్చింది. ఆయ‌న స్థానంలో సంచ‌యిత‌ను ప్ర‌భుత్వం ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా నియ‌మించింది. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్ట్ లో రిట్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. అంతేకాకుండా సంచ‌యిత వేసిన పిటీష‌న్‌ను కూడా హైకోర్ట్ తోసిపుచ్చింది. సింహాచ‌లం ట్ర‌స్ట్‌కు కూడా అశోక్ గ‌జ‌ప‌తి రాజును కొన‌సాగించాల‌ని హైకోర్టు ఆదేశించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story