నెల్లూరు గ్రూప్ పాలిటిక్స్ పై వైసీపీ హైకమాండ్ సీరియస్

నెల్లూరు గ్రూప్ పాలిటిక్స్‌పై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది.

Arun Chilukuri
Published on: 15 April 2022 3:31 PM IST
High Command Serious on Nellore Group Politics
X

నెల్లూరు గ్రూప్ పాలిటిక్స్ పై వైసీపీ హైకమాండ్ సీరియస్ 

Kakani Govardhan Reddy Vs Anil Kumar Yadav: నెల్లూరు గ్రూప్ పాలిటిక్స్‌పై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. రెండు రోజులుగా నేతలు వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం రచ్చపై జిల్లా నేతలతో పార్టీ ముఖ్యులు మాట్లాడి నేతలందరూ సంయమనంతో ఉండాలని హితవు పలికారు. ఈనెల 17న నెల్లూరులో రణభేరికి అటు కాకాని, ఇటు అనిల్ ఏర్పాట్లు చేసుకోవడంపైనా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విభేదాలు పెరిగే అవకాశముందని హెచ్చరించింది.

వ్యవసాయ మంత్రిగా చార్జ్ తీసుకున్నాక అదే రోజు నెల్లూరుకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రానుండటం కూడా రచ్చకు కారణమవుతుందా అన్న టెన్షన్లో హైకమాండ్ ఉంది. అందుకే ర్యాలీలు, సమావేశాలు వద్దనే వద్దంటూ నేతలకు తేల్చి చెప్పింది. ఎవరి నియోజకవర్గంలో వాళ్లు పనులు చేసుకోవాలని క్లారిటీ ఇచ్చిన హైకమాండ్ బాహాటంగా పార్టీ వ్యవహారాలపై రోడ్డును పడితే ఊర్కునేది లేదని హెచ్చరించినట్టు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story