Budameru High Alert: బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజలకు హై అలర్ట్‌

Budameru High Alert: భారీ వర్షాలతో బుడమేరుకు పెరుగుతున్న వరద ప్రవాహం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 Sept 2024 9:23 AM IST
High alert for the people of Budameru
X

Budameru High Alert: బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజలకు హై అలర్ట్‌

Budameru High Alert: విజయవాడను ముంచెత్తిన బుడమేరుతో మరో సారి ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుడమేరు పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పెరుగుతున్న వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్‌నగర్, గుణదల, రామవరప్పాడు ఏరియాలకు వరద చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. బుడమేరు పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story