వరదనీటిలో హీరో శర్వానంద్‌ తాతయ్య ఇల్లు

వరదనీటిలో హీరో శర్వానంద్‌ తాతయ్య ఇల్లు
x
Highlights

టాలీవుడ్ హీరో శర్వానంద్ తాతయ్య ఇల్లు వరదనీటిలో మునిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్‌ మైనేని హరిప్రసాద్‌కు చెందిన ఇల్లు..

టాలీవుడ్ హీరో శర్వానంద్ తాతయ్య ఇల్లు వరదనీటిలో మునిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్‌ మైనేని హరిప్రసాద్‌కు చెందిన ఇల్లు కృష్ణానది వరద నీటిలో పాక్షికంగా కొట్టుకుపోయింది. ఉన్న గోడలు కూడా కూలిపోయే స్థితి ఉంది. అయితే ఆ ఇంట్లో ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది. గతకొంతకాలంగా ఎవరు నివసించకుండా ఉండడంతో ప్రమాదం తప్పిందని అక్కడికి చూడటానికి వచ్చిన గ్రామస్థులు చెబుతున్నారు. భవనం వరదల్లో కొట్టుకుపోతుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ

ఇంటి పరిసరాల్లో నిలబడి ఒకింత ఆవేదనకు గురయ్యారు. టాలీవుడ్ హీరో శర్వానంద్‌కు హరిప్రసాద్‌ తాతయ్య కావడంతో గతంలో గ్రామానికి వచ్చినప్పుడు శర్వానంద్‌ ఇదే భవనంలో ఉండేవారు. దాంతో ఆయనను చూడటానికి ప్రజలు పెద్దఎత్తున వస్తుండేవారు. అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా మైనేని హరిప్రసాద్ సేవలందించారు, ఇదిలావుంటే గత ఏడాది సంభవించిన వరదల్లో కూడా శర్వానంద్‌ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories