తిరుమల కొండపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్: అధికారుల ఆరా

తిరుమల కొండపై సోమవారం ఉదయం హెలికాప్టర్ వెళ్లడం కలకలం రేపుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Oct 2024 11:16 AM IST
Helicopter Rounds in Tirumala Hills
X

తిరుమల కొండపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్: అధికారుల ఆరా

తిరుమల కొండపై సోమవారం ఉదయం హెలికాప్టర్ వెళ్లడం కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరచుగా తిరుమల కొండ మీదుగా విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే విషయాలపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమల కొండపై హెలికాప్టర్ ఎలా వెళ్లిందనే విషయమై అధికారులు ఏవియేషన్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు తిరుమల కొండపై నుంచిహెలికాప్టర్ వెళ్లకూడదు.

2023 ఏప్రిల్ 25న తిరుమల కొండపై విమానం చక్కర్లు కొట్టింది. ఈ విమానం గురించి టీటీడీ అధికారులు ఆరా తీశారు. ఈ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంగా అధికారులు చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story