Srisailam: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు

Srisailam: 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల * 2,65,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు

Sandeep Eggoju
Updated on: 29 July 2021 5:11 PM IST
Heavy Water Inflow to Srisailam Dam
X

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద (ఫైల్ ఇమేజ్)

Srisailam: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరగడంతో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 2లక్షల 65వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్‌ ఫ్లో 4లక్షల 60వేల 154 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 212.4385 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోపక్క కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story