AP News: తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ భ‌ద్ర‌త‌.. అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Oct 2024 1:10 PM IST
Heavy security for Tirumala Brahmotsavam
X

AP News: తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ భ‌ద్ర‌త‌.. అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ

AP News: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్స వాలకు 5,145 మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీద్వారక తిరుమలరావు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భద్రతపై గోకులం గెస్ట్ హౌస్ లో పోలీసు, విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 8వ తేదీన జరిగే గరుడోత్సవానికి కూడా దాదాపు 4 వేల మంది సిబ్బందితో పాటు అదనంగా 1,250 మందిని బందోబస్తులో ఉంచుతామన్నారు. సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు తెలిపారు. పాతనేరస్థులపై నిఘా ఉంచడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story