Weather Update: ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

Weather Update: అండమాన్ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది.

Arun Chilukuri
Published on: 16 Nov 2021 7:42 PM IST
Heavy Rains to Continue in Andhra Pradesh for the Next Three Days
X

Weather Update: ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

Weather Update: అండమాన్ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం ఏపీపై రేపు, ఎల్లుండి ఉంటుందని పేర్కొంది. కోస్తాంధ్రలో రేపు పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వివరించింది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story