Prakasam: వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వర్షాలు

* ఒంగోలులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం * లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు

Shilpa
Published on: 11 Nov 2021 10:01 AM IST
Heavy Rains in Prakasam District due to Cyclone formed in Bay of Bengal
X

వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వర్షాలు(ఫైల్ ఫోటో)

Prakasam: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తీరప్రాంత మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో ముసురుపట్టి ఉదయం నుంచి ఏడతెరపి లేకుండా వర్షం కురస్తూనే ఉంది.

పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయయ్యాయి. పలు చోట్ల నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శివారు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Shilpa

Shilpa

Next Story