Heavy Rains: నెల్లూరు జిల్లాలో దంచికొడుతున్న భారీ వర్షాలు

* పల్లపు ప్రాంతాలలోకి పోటెత్తుతున్న వరదనీరు * నెల్లూరు నగరంలో పొంగిపొర్లుతున్న భూగర్భ డ్రైనేజీ

Shilpa
Updated on: 28 Nov 2021 9:34 AM IST
Heavy Rains in Nellore due to Low Pressure in East Bay of Bengal
X

నెల్లూరు జిల్లాలో దంచికొడుతున్న భారీ వర్షాలు(ఫైల్ ఫోటో)

Heavy Rains: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం నెల్లూరు జిల్లా పై మరోసారి తీవ్రరూపం దాలుస్తోంది. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు నెల్లూరు జిల్లాలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి, జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని తీర ప్రాంతంలో ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది.

నెల్లూరు నగరం తడిసి ముద్దయింది. వర్షం ధాటికి భూగర్భ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలకు మరోసారి వరద ముప్పు ముంచుకొస్తోంది. నెల్లూరు నగరం సహా తీరంలో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి.


Shilpa

Shilpa

Next Story