Nellore: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

Nellore: పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

Sandeep Eggoju
Updated on: 30 Nov 2021 11:57 AM IST
Heavy Rains in Nellore District
X
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Nellore: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. దాదాపు 10 కిలోమీటర్లకుగా పైగా వాహనాలు నిలిచిపోయాయి. నాయుడుపేట నుంచి దొరవారిసత్రం వరకు, ఓజిలి నుంచి నాయుడుపేట వరకు హైవేపై వె‍హికల్స్‌ ఆగిపోయాయి.

మరోవైపు గూడూరు - మనుబోలు మధ్య కిలోమీటర్ల వరకు ట్రాఫిక్‌ జామ్ అయింది. గూడూరు వద్ద కైవల్య, పంబలేరు, కండలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గత రాత్రి నుంచి రాకపోకలు మళ్లించారు అధికారులు. చెన్నై - తిరుపతి నుంచి నెల్లూరు వైపు వచ్చే వాహనాలను వెంకటగిరి, రాపూరు మీదుగా మళ్లించారు. నెల్లూరు నుంచి చెన్నై, తిరుపతి వైపు వెళ్ళే వాహనాలను పోర్టు రోడ్డు మీదుగా కోట వైపు దారి మళ్లించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story