Weather Report: నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం.. నేడు, రేపు భారీ వర్షాలు

Weather Report: రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం

Jyothi
Published on: 6 May 2023 10:21 AM IST
Heavy Rains In Andhra Pradesh Next Two days
X

Weather Report: నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం.. నేడు, రేపు భారీ వర్షాలు

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల పంట వర్షార్పణం అయింది. లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ వానలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఐఎండి అంచనా ప్రకారం.. ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుంది. ఇది.. రేపు అల్పపీడనంగా మారి.. ఎల్లుండి నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం.. ఉత్తర దిశగా కదులుతూ తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో.. ఈ రోజు, రేపు వర్షాలు కురిసే అవకాశముంది.. ఈ నేపథ్యంలో.. అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. రేపటి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక మార్కెట్లోగానీ, వ్యవసాయ క్షేత్రంలోగాని పంటలు దెబ్బతినకుండా రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సంబంధింత అధికారులు సూచించారు.

Jyothi

Jyothi

Next Story