Anantapur: అనంతపురం నగర శివారులో భారీ వరద ప్రవాహం
Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
Anantapur: అనంతపురం నగర శివారులో భారీ వరద ప్రవాహం
Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలు అనంతపురం నగరాన్ని చుట్టుముట్టేస్తున్నాయి. ఇదివరకే కురిసిన వర్షాలకు నిండుగానున్న చెరువుల్లో నుంచి నీరు మత్తడి పారుతోంది. ప్రధానంగా అనంతపురం రూరల్ పరిధిలో గల రుద్రంపేట నుంచి అనంతపురం నగరంలోకి వచ్చే చోట నడిమివంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రుద్రంపేట, అనంతపురం నగరానికి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 4వ రోడ్డులోని రజక్ నగర్, రంగస్వామినగర్, సీపీఐ కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story




