Weather Alert: సంక్రాంతి పండుగపూట రెయిన్ అలెర్ట్‌

Heavy Rains During the Sankranthi Festival
x

Weather Alert: సంక్రాంతి పండుగపూట రెయిన్ అలెర్ట్‌

Highlights

Rain Alert in TS And AP:నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు.. వ్యాపించిన ఉపరితల ఆవర్తనం

Sankarathi Festival Rain: ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో వర్షాలు తప్పవని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించినట్లు అధికారులు వివరించారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చిరు జల్లులు కురవనున్నాయి. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం కూడా కాస్త పెరిగింది.

ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో గత ఐదారు రోజుల నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories