తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
x
Highlights

పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో తిరుమల కొండపై ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది.

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో తిరుమల కొండపై ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది, వర్షం కారణంగా శ్రీవారి భక్తులతో పాటు స్థానికంగా నివసిస్తున్న ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరోవైపు ఉదయమే వర్షం మొదలు కావడంతో పాఠశాలకు వెళ్లే పిల్లలు కూడా కొంత ఇబ్బందులు పడ్డారు, ఇక శ్రీవారి ఆలయ ప్రాంగణంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు తలదాచుకోవడానికి తాత్కాలిక షెడ్ ల వైపు పరుగులు తీస్తున్నారు.

ఘాట్ రోడ్ లో వర్షం కారణంగా కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా వాహనాలను నడపాలని టిటిడి సూచిస్తుంది, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జాగ్రత్త వహించాలని టీటీడీ సూచిస్తోంది.. వాతావరణ శాఖ నుండి వచ్చిన సమాచారం దృష్ట్యా రేపు కూడా వర్ష సూచన ఉండడంతో భక్తులు, వర్షం పడే సమయంలో భక్తులు సురక్షిత ప్రాంతాలు విడిచి బయట తిరగరాదని భక్తులకు టీటీడీ సూచిస్తుంది.Show Full Article
Print Article
More On
Next Story
More Stories