Anantapur: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Anantapur: పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు * కాలనీల్లోకి చేరిన వరద నీరు

Sandeep Eggoju
Updated on: 22 Oct 2021 2:10 PM IST
Heavy Rainfall in Anantapur District
X
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Anantapur: అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి డ్యాం నిండుకుండలా మారింది. పెద్దఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వర్షపు నీరు శివారు కాలనీలను ముంచెత్తింది. 20 ఏళ్ల క్రితం చెరువు కట్ట తెగిపోయింది. నిన్న కురిసిన వర్షానికి ప్రవాహం ఎక్కువ కావడంతో ఆత్మకూరు ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ప్రవాహం రావడంతో ఆర్టీసీ బస్సు ఇరుక్కుంది. ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story