స్మార్ట్ సిటీలో కాలు బయటపెట్టాలంటే భయపడుతున్న జనం

స్మార్ట్ సిటీలో కాలు బయటపెట్టాలంటే భయపడుతున్న జనం
x
Highlights

పేరుకు స్మార్ట్ సిటీ. కానీ, రోడ్లను చూస్తే మాత్రం అధ్వానంగా మారాయి. అడుగడునా గుంతలతో ప్రయాణం సాఫీగా సాగడం లేదు ఎడాపెడా కురుస్తున్న వర్షాలు.. ప్రకృతి...

పేరుకు స్మార్ట్ సిటీ. కానీ, రోడ్లను చూస్తే మాత్రం అధ్వానంగా మారాయి. అడుగడునా గుంతలతో ప్రయాణం సాఫీగా సాగడం లేదు ఎడాపెడా కురుస్తున్న వర్షాలు.. ప్రకృతి వైపరిత్యాలకు తోడు.. జరుగుతోన్న అభివృద్ధి పనులతో స్మార్ట్ సిటి కాకినాడలో రోడ్ల పరిస్థితి చెప్పుకోలేని విధంగా తయారైయ్యాయి. దీంతో వర్షం పడిందంటే చాలు చెరువులను తలపించే నగర వీధుల్లో ఏ గుంత ఎక్కడ ఉందో తెలియక కాకినాడ వాసులు అగచాట్లు పడుతున్నారు.

బ్రిటీష్ వర్తకుల కేంద్రంగా వెలసిన కాకినాడ నగరం. రెండో మద్రాస్‌గా కూడా ప్రసిధ్ది. చక్కటి టౌన్ ప్లానింగ్ ఉండే ఆ నగరానికి కో- కెనడా గా పేరు. ఇంత ప్రసిద్ధి చెందిన కాకినాడలో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అయితే మున్సిపాలిటీ నుంచి కార్పోరేషన్ కార్పోరేషన్ నుంచి స్మార్ట్ సిటిగా రూపాంతరం చెందుతోన్న కాకినాడ నగరంలో మాత్రం అభివృద్ధి కనిపించడం లేదు. చిన్న చినుకు పడితే సాగర తీరాన్ని తలపించే రోడ్లు నగరమంతా కనిపిస్తుంటాయి.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాకినాడ నగరంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారాయి. వర్షపు నీటిలో ఎక్కడ గుంత తెలియక జనం వాహనాలతో సహా పడిపోయిన ఘటనలు కనిపించాయి. రోడ్లు చిధ్రం కావడంతో నగర వాసులు గాయాలపాలయ్యారు. కాకినాడ నగరంలోని 50 డివిజన్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మెయిన్ రోడ్డు సినిమా రోడ్డు దేవాలయం వీధి ఈ ముడు రహదారుల్లో ఎక్కడ చూసిన గుంతలే దర్శనమిస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో కనీసం మరమ్మత్తులు చేపట్టకపోవడం మరోవైపు వేసిన రోడ్లు నాసిరకంగా ఉండడమే కారణమంటున్నారు కాకినాడ వాసులు.

ఇక నగరంలో కనిపించే ప్రధాన రోడ్లు అధికారుల ప్రజాప్రతినిధుల నివాసానికి వెళ్లే రహదారులకు మాత్రం నిత్యం మరమత్తులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాకినాడ వాసులు. కోట్లాది రూపాయిలు వెచ్చించి అభివృద్ధిని ప్రజాప్రతినిధులకే అందించడమేంటి ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ సిటీలో బలం, పలుకుబడి ఉన్న కార్పొరేటర్లు, తమ ప్రభావంతో పనులు చేయించుకోవడం కమీషన్ల కోసం ప్రాధాన్యత లేని పనులు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కాకినాడ వాసులు వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories