Tirupati Rains: తిరుపతిలో మరోసారి భారీ వర్షం

Tirupati Rains: ఈదురు గాలులకు నేలకొరిగిన చెట్లు

Sandeep Eggoju
Updated on: 18 Nov 2021 9:27 PM IST
Water Lash in Tirupati Due to Heavy Rains
X

మరోసారి తిరుపతిలో భారీ వర్షాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Tirupati Rains: మరోసారి భారీ వర్షాలతో తిరుమతి జలదిగ్భంధంలో చిక్కుకుంది. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులకు వృక్షాలు నేలకొరిగాయి. వరదలకు రోడ్లన్నీ జలపాతాలను తలపిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా రేపు అన్ని విద్యాసంస్థలకు శెలవు ప్రకటించారు. ప్రమాదకర ప్రదేశాల్లో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

భారీ వర్షాలతో తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని పోలీసులు అప్రమత్తం అయ్యారు. సహాయకచర్యలు అందించేందుకు స్పెషల్ పార్టీ పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించిన పోలీసులు ఎలాంటి అవసరం ఏర్పడినా.. 8099999977కు సమాచారం ఇవ్వాలన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story