Heavy Rain: తిరుమలలో భారీ వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న భక్తులు..

Heavy Rain: మధ్యాహ్నం ఒక్కసారిగా దంచికొట్టిన వాన

Dhatripriya
Published on: 18 May 2023 5:39 PM IST
Heavy Rain In Tirumala
X

Heavy Rain: తిరుమలలో భారీ వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న భక్తులు..

Heavy Rain: తిరుమల కొండపై ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. స్వామి వారి దర్శనానికి వెళ్ళే భక్తులు, స్వామి వారి దర్శనంతరం వెలుపలకు వచ్చే భక్తులు వసతి గృహాలకు వెళ్ళేందుకు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కారణంగా తిరుమల ఘట్ రోడ్డులో‌ ప్రయాణించే ప్రయాణీకులను టీటీడీ విజిలెన్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో భక్తులు అప్రమత్తంగా ప్రయాణించాలని విజిలెన్స్ సిబ్బంది‌ విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం నుంచి ఎండ మండిపోగా.. మధ్యాహ్నం తర్వాత వరుణ దేవుడు కరుణించాడు. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే జోరు వర్షంలో శ్రీవారి భక్తులకు ఇబ్బందులు తప్పలేదు.

Dhatripriya

Dhatripriya

Next Story