ఏపీలో మారనున్న వాతావరణం.. రానున్న రెండు రోజుల్లో..

ఏపీలో మారనున్న వాతావరణం.. రానున్న రెండు రోజుల్లో..
x
Highlights

అయితే లాక్ డౌన్ కావడం, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కూలిపనులకు వ్యవసాయ పనులకు రైతులకు ఇబ్బంది కలుగుతుంది.

అయితే లాక్ డౌన్ కావడం, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కూలిపనులకు వ్యవసాయ పనులకు రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ గుండె బద్దలయ్యేలా వార్త అందించింది. మిర్చి, పసుపు పంటలు చేతికొచ్చే సమయంలో వర్షం కురిస్తే రైతులు పంట మరింత నష్టపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సోమ మంగళవారాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు ప్రభావం ఉంటుందని వివరించారు వాతావరణ సంచాలకులు. రాష్ట్రంలోని యానాం లలో, ఉత్తర కోస్తా లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది విశాఖపట్నం విజయనగరం జిల్లాలో మంగళవారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయోచ్చు.

ఇక దక్షిణ కోస్తాలో మంగళవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో సోమవారం మంగళవారం ఒక మోస్తరు వర్షాలు కురవవు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు కావచ్చు అని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా విజృంభణతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతుంటే. ఇప్పుడు వర్షాలు పడి కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని ప్రజలను భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories