ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు గుండెపోటు

Daggubati Venkateswara Rao: సీనియర్ రాజకీయవేత్త, స్వర్గీయ ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగ‌ళ‌వారం గుండెపోటుకు గుర‌య్యారు.

Arun Chilukuri
Published on: 21 Jun 2022 8:24 PM IST
Heart Attack to Daggubati Venkateswara Rao
X

ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు గుండెపోటు

Daggubati Venkateswara Rao: సీనియర్ రాజకీయవేత్త, స్వర్గీయ ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగ‌ళ‌వారం గుండెపోటుకు గుర‌య్యారు. అయితే చాలా వేగంగా స్పందించిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు హుటాహుటీన ఆయ‌న‌ను అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ద‌గ్గుబాటికి చికిత్స అందించిన వైద్యులు ఆయ‌న గుండెలో స్టెంట్‌ను అమ‌ర్చారు. ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు హుటాహుటీన అపోలో ఆసుప‌త్రికి చేరుకున్నారు. ద‌గ్గుబాటిని చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. ద‌గ్గుబాటి ఆరోగ్యంపై చంద్ర‌బాబు అపోలో ఆసుప‌త్రి వైద్యుల‌ను వివ‌రాలు తెలుసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story