Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu: నిన్న చంద్రబాబు తరపున వాదనలు విన్పించిన హరీష్‌ సాల్వే

Shekhar G
Published on: 10 Oct 2023 8:41 AM IST
Hearing On Chandrababu Quash Petition Today In Supreme Court
X

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. జస్టిస్‌ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 3న దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో నేడు మళ్లీ వాదనలు కొనసాగాయి.

Shekhar G

Shekhar G

Next Story