Chandrababu: నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

Chandrababu: నేడు తీర్పు వెల్లడించనున్న ఏసీబీ కోర్టు

Shekhar G
Published on: 9 Oct 2023 9:42 AM IST
Hearing On Chandrababu Quash Petition In Supreme Court Today
X

Chandrababu: నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

Chandrababu: స్కిల్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తన క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇటీవల ఈ పిటిషన్‌లో వాదనలు విన్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టులో ఇవాళ్టి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు, బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పైనా, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపైనా విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ లో ఉంచింది. ఈ పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువడనుంది.

ఇక, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు , అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. ఈ కేసుల్లో ఇటీవల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Shekhar G

Shekhar G

Next Story