ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

Chandrababu Arrest: ప్రధాన న్యాయమూర్తి బెంచ్ దగ్గర.. ప్రస్తావించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు

Jyothi
Published on: 25 Sept 2023 10:18 AM IST
Hearing on Chandrababu Quash Petition in Supreme Court Today
X

ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

Chandrababu Arrest: ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కేసును కొట్టివేయాలని.. ఏసీబీ కోర్టు రిమాండ్‌ను రద్దు చేయాలని... ఇక ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతో, వేధింపులతోనే అరెస్టు చేశారని.. స్కిల్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి అక్రమాలు లేవని.. రాష్ట్ర ప్రభుత్వ వాటా విలువను కేంద్ర సంస్థ ధృవీకరించిందని పేర్కొన్నారు.

డబ్బు దారి మళ్లించినట్లు సీఐడీ ఎలాంటి ఆధారాలు చూపించలేదని.. 2018 తర్వాత కేసులకు 17-A వర్తిస్తుందని పిటిషన్‌లో తెలిపారు. విచారణ ప్రక్రియను సీఐడీ దుర్వినియోగం చేస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు చంద్రబాబు తరపు లాయర్లు.

Jyothi

Jyothi

Next Story