హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ.. వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే

Chandrababu Arrest: ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 21కి వాయిదా

Shekhar G
Updated on: 19 Sept 2023 1:00 PM IST
Hearing On Chandrababu Quash Petition In High Court
X

హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ.. వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే.

Chandrababu Arrest: ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది ధర్మాసనం. మరోవైపు.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్‌ అనుమతి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. ప్రజాప్రతినిధుల అరెస్ట్ విషయంలో గతంలో అనేక జడ్జిమెంట్లు ఉన్నాయని గుర్తుచేశారు.

2020లో నమోదైన FIR లో చంద్రబాబును ఎలా అరెస్ట్‌ చేస్తారన్నారు. అరెస్ట్‌ చేసే సమయానికి చంద్రబాబుపై FIR లేదు.. FIR నమోదయ్యాకే చంద్రబాబును అరెస్ట్‌ చేయాలన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో CID అధికారులు నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు హరీష్‌ సాల్వే.

Shekhar G

Shekhar G

Next Story