Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ విజయకృష్ణ రాజీనామా

*అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన విజయకృష్ణ *ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు సమాజాం సిగ్గుపడేలా ఉంది : విజయకృష్ణ

Shilpa
Updated on: 20 Nov 2021 1:43 PM IST
Head Constable Vijaya Krishna Resigns to his Job as Chandrababu was Insulted
X

చంద్రబాబుకు అవమానం జరిగిందంటూ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబుకు అవమానం జరిగిందంటూ ప్రకాశం జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజయకృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బాబు హయాంలో తనకు ఉద్యోగం వచ్చిందని గుర్తుచేసుకున్నాడు.

వైసీపీ సర్కార్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సభలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించిన తీరు సమాజాం సిగ్గుపడేలా ఉందన్నారు. స్వచ్ఛంధంగా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు విజయకృష్ణ తెలిపారు. తజాగా ఈ వ్యవహారం ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో సంచలనం సృష్టిస్తోంది.


Shilpa

Shilpa

Next Story