Chittoor: చిత్తూరు జిల్లా రేణిగుంటలో హెడ్‌ కానిస్టేబుల్‌ సూసైడ్

Chittoor: పిస్టోల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఆనందరావు * ఆర్పీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆనందరావు

Sandeep Eggoju
Published on: 8 Aug 2021 9:30 AM IST
Head Constable Self Distraction in Chittoor District Renigunta
X

Representational Image

Chittoor: చిత్తూరు జిల్లా రేణిగుంటలో విషాదం చోటుచేసుకుంది. RPF బ్యారక్‌లో పిస్టోల్‌తో కాల్చుకొని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 4గంటల సమయంలో ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిపురం ఆనందరావుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

రేణిగుంటలో రైల్వే ప్రొటెక్షన్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా ఆనందరావు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తన సొంత గ్రామానికి వెళ్లిన ఆనందరావు.. ఈ నెల 2న తిరిగి డ్యూటీలో జాయిన్‌ అయ్యారు. అయితే.. ఆదివారం తెల్లవారుజామున ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న రేణిగుంట అర్బన్‌ సీఐ అంజు యాదవ్‌.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story