Nellore: హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య

Nellore: నెల్లూరు జిల్లా బనగానపల్లెలో ఘటన

Shekhar G
Published on: 5 Aug 2023 4:46 PM IST
HDFC Bank Deputy Manager Commits Suicide
X

Nellore: హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య

Nellore: నంద్యాల జిల్లా బనగానపల్లెలో HDFC బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న 40 ఏండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి కాగా కుటుంబ సభ్యులు కర్నూల్ లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా HDFC బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ మరో ఇద్దరు సహచర ఉద్యోగులతో కలిసి బనగానపల్లె లోని పెండేకంటి నగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ నివాసం ఉంటున్నారు.

సెలవు దినాల్లో మాత్రం కర్నూలుకు వెళ్లి వస్తారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆత్మహత్య ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు..

Shekhar G

Shekhar G

Next Story