టీడీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా.. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే నాయకుడే లేడా..?

Has the TDP Downfall Started
x

టీడీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా.. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే నాయకుడే లేడా..?

Highlights

Chandrababu: టీడీపీలో ఏం జరుగుతోంది..? పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినా.. కేడర్ ఎందుకు సైలెంట్ అయింది..?

Chandrababu: టీడీపీలో ఏం జరుగుతోంది..? పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినా.. కేడర్ ఎందుకు సైలెంట్ అయింది..? కార్యకర్తల్లో ఈ నిరుత్సాహానికి కారణం ఏంటి..? నడిపించే నాయకుడు లేక పార్టీ కేడర్ అయోమయానికి గురి అవుతుందా..? బాబు అరెస్టుపై తమ్ముళ్ల నుంచి ఎందుకు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడానికి కారణం ఏంటి...? ఎందుకు వైసీపీపై దూకుడుగా వెళ్లలేపోతున్నారు..? కేడర్‌లో ధైర్యం నింపడంలో లోకేష్ వెనకబడ్డారా..? చంద్రబాబు లేకపోతే.. ఇక పార్టీ పరిస్థితి అంతేనా..? బాబు తర్వాత అంతగా ప్రభావితం చేసే ప్రత్యామ్నాయ లీడర్ పార్టీలో లేరా..? నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు ఓ వెలుగు వెలిగిన.. టీడీపీకి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఓ ప్రభంజంనం అని చెప్పాలి. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1983లో పార్టీ పెట్టిన ఎన్టీఆర్.. కేవలం 9నెలల్లోనే అధికారంలో చేపట్టి కాంగ్రెస్‌ను ఖంగు తినిపించారు. అన్నగారిని అంతగా ఆదరించారు తెలుగు ప్రజలు. రూపాయికి కిలో బియ్యం లాంటి అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి.. పాలనలోనూ తనదైన మార్క్ చూపించారు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల పార్టీగా భారీ ఎత్తున కేడర్‌ను సంపాదించుకుంది టీడీపీ. 1994లో టీడీపీలో మరోసారి తలెత్తిన రాజకీయ సంక్షోభంతో సీఎం పీఠం దక్కింకున్నారు చంద్రబాబు. ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని సక్సెస్ ఫుల్ గా రన్ చేయడంతో.. 1999 ఎన్నికల్లోనూ టీడీపీ విజయకేతనం ఎగురేయడంతో రెండోసారి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

2003లో తిరుమల అలిపిరి వద్ద జరిగిన దాడి ఘటన అనంతరం సింపతీ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో ముందస్తుకు వెళ్లారు బాబు. కానీ 2004లో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ అధికారాన్ని కోల్పోగా.. వైఎస్సార్ నేృతృత్వంలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. వైఎస్సార్ సంక్షేమ పథకాలతో జనం చూపు అటు వైపు మళ్ళింది. 2009లోనూ వైఎస్సాఆర్ హవానే కొనసాగడండంతో అప్పటి వరకు రూట్ లెవెల్లో బలంగా ఉన్న టీడీపీ కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టు అయింది. ఇక చంద్రబాబు పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ysr మరణం, అనివార్యమైన రాష్ట్ర విభజనతో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. విభజనతో కష్టాల్లో ఉన్న ఏపీని తన పాలనా అనుభవంతో గట్టెక్కిస్తాడనే నమ్మకంతో 2014 ఎన్నికల్లో బాబుకు అధికారం గట్టబెక్కారు ప్రజలు. కానీ తెలంగాణలో మాత్రం..15సీట్లకే పరిమితం అయింది. ఆంధ్ర పార్టీ అంటూ మెల్లమెల్లగా తెలంగాణలో టీడీపీని డీలా పరిచారు కేసీఆర్.

రాజధాని అమరావతి నిర్మాణం, కొత్త పరిశ్రమలు, ఉద్యోగ కల్పన పేరుతో 2019లో ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుకు షాక్ ఇచ్చారు ఏపీ ప్రజలు. వైసీపీ గాలిలో టీడీపీ చిత్తు అయింది. 175స్థానాలకు..కేవలం 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయింది టీడీపీ. అప్పటి వరకు బలంగా ఉన్న టీడీపీకి కేవలం 23సీట్లే రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫలితం అటు పార్టీ కేడర్‌‌ను కూడా కుంగదీసినట్టు అయింది. ఏజ్ బార్‌తో చంద్రబాబు మునపటిలా పోరాటం చేస్తారా.. ఒకవేళ నెక్ట్స్ టర్మ్ కూడా పార్టీ అధికారంలోకి రాకపోతే టీడీపీని నడిపించేది ఎవరు అనే ప్రశ‌్నలు తలెత్తాయి. ఐతే 75ఏళ్ల వయసులోనూ వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్న చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు జగన్. స్కిల్ డెవలప్ మెంట్ అవినీతి కేసులో సీఐడీ అరెస్ట్ చేసింది. 42ఏళ్ల మచ్చలేని రాజకీయం అంటూ ఎప్పుడూ చెప్పుకునే చంద్రబాబుని.. నైతికంగా దెబ్బతీసినట్టు అయింది.

చంద్రబాబు అరెస్టుతో ఏపీలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని,, కేడర్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని అంతా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ టీడీపీ కేడర్ తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుపై ఊహించినంతా స్పందన కరువైందనే చెప్పలి. అక్కకడ్కడ నిరాహార దీక్షలు మినహా.. పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. టీడీపీ కార్యకర్తలో ఇంతటి నిరుత్సాహం నెలకొనడానికి కారణం ఏంటన్నది అంతుచిక్కకుండా ఉంది. పార్టీ శ్రేణుల్లో లోకేష్ భరోసా నింపలేకపోతున్నారా..? లోకేష్ పైన నమ్మకం లేకనే చంద్రబాబు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. యువగళం పాదయాత్రతో లోకేష్ దూకుడుగా వెళుతున్నా.. సీనియర్లను కలుపుకొని పోవడం లేదనే ఆపవాదు ఉంది. ఇటు సీనియర్లు కూడా లోకేష్ తో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని.. పార్టీ లీడర్ల తీరును చూస్తుంటే అర్థం అవుతోంది.

టీడీపీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే టీడీపీ అన్నట్టుగా మారింది ఇన్నేళ్లు. వన్ మ్యాన్ ఆర్మీగా పార్టీని నడిపించారు చంద్రబాబు. పార్టీలో అన్ని తానై వ్యవహించారు. దీంతో చంద్రబాబు తర్వాత అంతటి ప్రభావం చూపే ప్రత్యామ్నాయం లీడర్ లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తర్వాత పార్టీని ముందుకు నడిపించే నాయకుడు కరువైయ్యాడనే గుసగులసు వినిపిస్తున్నాయి. టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించే వరకూ తమ్ముళ్ల ముఖాల్లో ఆ ఉత్సాహం కనిపించలేదు. ఒకవేళ ఎన్నికల వరకు..చంద్రబాబు జైల్లోనే ఉంటే.. టీడీపీ పరిస్థితి ఏంటి.. లీడర్లను, కేడర్ ఎవరు సమన్వయం చేస్తారు అనే ప్రశ‌్నలు తలెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories