Tirumala: తిరుమల కొండపై వడగళ్ల వాన..

Tirumala: ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న భక్తులు

Dhatripriya
Published on: 21 April 2023 5:49 PM IST
Hailstorm In Tirumala Hill
X

Tirumala: తిరుమల కొండపై వడగళ్ల వాన..

Tirumala: తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు భానుడు ప్రతాపం చూపించగా.. మధ్యాహ్నం తర్వాత వరుణుడి ఎంట్రీతో ఒక్కసారిగా వాతావరణం కూల్‌గా మారిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్న యాత్రికులు వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీశారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లోకి వర్షపు నీరు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. మధ్యాహ్నం వరకు భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరైన భక్తులు... వర్షం రావడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలగడంతో ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story