GVL Narasimha Rao: ఓ జిల్లాకు రంగా పేరు పెట్టాలి.. రాజ్యసభలో జీవీఎల్ డిమాండ్..!

GVL Narasimha Rao: ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 13 Feb 2023 3:58 PM IST
GVL Narasimha Rao Demands To Put Vangaveeti Name To Krishna District
X

GVL Narasimha Rao: ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. జీరో అవర్‌లో మాట్లాడిన ఎంపీ జీవీఎల్.. కృష్ణా లేదా మచిలీపట్నం జిల్లాలకు రంగా పేరు పెట్టాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన రంగా ప్రఖ్యాతి పొందిన నాయకుడని చెప్పారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రంగా పేరు పెట్టాలని పౌర విమానయాన శాఖను కోరారు. రంగాను కొందరు ద్రోహులు హతమర్చారని.. ఇప్పటికీ ప్రజల మనసుల్లో రంగా ఉన్నారని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story