ఆ యువకుడితో పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ యువతి సెల్ఫీ వీడియో

Guntur: గుంటూరు జిల్లాలో ఓ యువతి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 13 Jan 2022 4:12 PM IST
Guntur Woman Selfie Video Viral
X

ఆ యువకుడితో పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ యువతి సెల్ఫీ వీడియో

Guntur: గుంటూరు జిల్లాలో ఓ యువతి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ప్రేమించిన యువకుడితో పెళ్లి జరగకపోతే సూసైడ్‌ చేసుకుంటానంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోంది. చెరుకుపల్లి మండలం కొత్తపేటకు చెందిన వైష్ణవి ప్రేమలో మోసపోయానంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాయి శ్రీనివాస్‌ అనే యువకుడు తనను మోసం చేశాడని తన గోడు వెల్లబోసుకుంటోంది. పెళ్లి గురించి అడిగితే శ్రీనివాస్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని చెబుతోంది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీని సంప్రదించింది. తనకు న్యాయం చేయాలంటూ వైష్ణవి ఎస్పీని వేడుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story