విషాదం : ఆత్మహత్య చేసుకున్న Tik Tok ప్రేమ జంట!

విషాదం :  ఆత్మహత్య చేసుకున్న Tik Tok ప్రేమ జంట!
x
Highlights

Tik Tok: గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్ లో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లాకు...

Tik Tok: గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్ లో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన శైలజ మంగళగిరికి చెందిన పవన్ కుమార్‌లకు టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఆగస్టు మూడో తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఇల్లు అద్దెకు తీసుకుని కొత్తకాపురం ప్రారంభించారు.

ఇదే సమయంలో శైలజ తల్లిదండ్రులు ఎంటర్ అయ్యారు. పవన్ ను వదిలేసి ఇంటికి రావాలని శైలజపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అప్పటి నుండి శైలజ సెల్ ఫోన్ కూడ వాడటం మానేసింది. ఆ తరువాత పవన్ కుమార్ కు శైలజ బందువులు ఫోన్ చేసి చంపుతామని బెదిరించారు. దీంతో ప్రేమ జంట భయంతో వణికి పోయింది. ప్రేమ జంట ఫ్యాన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మృత దేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories