బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పురోగతి.. హత్యకు ముందు ఆ 8 నిమిషాలు..

Guntur BTech Student Ramya Case Update
x

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పురోగతి.. హత్యకు ముందు ఆ 8 నిమిషాలు..

Highlights

Guntur: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Guntur: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసింది శశికృష్ణగా పోలీసులు భావిస్తున్నారు. హత్య చేయడానికి ముందు ఎనిమిది నిమిషాలు రమ్యతో మాట్లాడినట్లు తెలుసుకున్నారు. శశికృష్ణతో రమ్య వాగ్వివాదం చేసిన కొన్ని నిమిషాల తర్వాత హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శశికృష్ణ ఆచూకీ కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. రమ్యను హత్య చేయడం బాధాకరమన్నారు హోంమంత్రి సుచరిత. కొన్ని ఆధారాలు సేకరించామన్న హోంమంత్రి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories