Visakhapatnam: వలస కూలీలకు నిత్యావసర వస్తువులు అందించిన గుడివాడ యువసేన

Swathi Adulapuram
Published on: 27 April 2020 9:05 AM IST
Visakhapatnam: వలస కూలీలకు  నిత్యావసర వస్తువులు అందించిన గుడివాడ యువసేన
X

విశాఖపట్నం: గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్, గుడివాడ యువ సేన ఆధ్వర్యంలో గుడివాడ లతీష్ నాయకత్వంలో దేశంలో కోవిడ్ -19 విజృంభిస్తున్న ఈ సమయంలో లాక్ డౌన్ రోజు వారి కూలీలు వలస కార్మికులకు ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న ప్రజలకు తన వంతు సహాయముగా రోజుకు సుమారుగా 500 మందికి భోజనాలు, కూరగాయలు, నిత్యవసర సరుకులు గుడివాడ యువసేన తరపున పంచడం జరుగుతుంది.

ఈ సందర్భంగా 68 వార్డ్ వైయస్సార్ పార్టీ నాయకులు గుడివాడ లతీష్ మాట్లాడుతూ... రోజు రోజుకి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కావున ప్రజలందరూ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుని సామాజిక దూరాన్ని పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో బయటకు రాకుండా స్వయం నియంత్రణ పాటిస్తూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టే దిశగా ప్రజలు పయనించాలని తెలియజేశారు.

Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story