Gudivada Amarnath: అమరావతిలో బాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత

Gudivada Amarnath Slams Chandrababu
x

Gudivada Amarnath: అమరావతిలో బాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత

Highlights

Gudivada Amarnath: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gudivada Amarnath: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి ఒక అవకాశంగా మార్చుకున్నారని, విచ్చలవిడిగా ప్రజాధనం లూటీ చేశారన్నారు. ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదన్న ధీమాతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఈ మేరకు ప్రకటన చేస్తూ.. అందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు మంత్రి అమర్నాథ్‌.

సచివాలయం, కోర్టు నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలను షాపూర్‌ జీ పల్లోంజి చేపట్టిందన్నారు. మనోజ్‌ వాసుదేవ్‌ షాపూర్‌ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి అని తెలిపారు. మనోజ్‌ వాసుదేవ్‌ 2019లో చంద్రబాబుని కలిశారని.. తన పీఏ ఇచ్చే ఆదేశాలను ఫాలో కావాలని ఆయనకు బాబు చెప్పారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత. దోచుకోవడానికి చంద్రబాబు అలవాటు పడ్డారని విమర్శించారు మంత్రి అమర్నాథ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories