Breaking News: ఏపీ కేబినెట్ లో గుడివాడ అమర్నాథ్ కు చోటు

Breaking News: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ

Rama Rao
Published on: 10 April 2022 5:28 PM IST
Gudivada Amarnath Reddy in the AP Cabinet List | AP News
X

Breaking News: ఏపీ కేబినెట్ లో గుడివాడ అమర్నాథ్ కు చోటు

Breaking News: ఏపీ కేబినెట్ లో తొలిసారిగా మంత్రి పదవి దక్కించుకున్నారు గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీమంత్రి గుడివాడ గురునాథరావు, నాగమణి దంపతలకు 1985 జనవరి 22న జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. 2006 లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్ గా విజయం సాధించాడు.

అతి పిన్న వయస్సులోనే విశాఖ పట్నం జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడుగా పని చేశారు. 2011 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధిగా పని చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి వైఎస్సార్ సీపీ తరనపు పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి గోవింద సత్యనారాయణపై ఎనిమిది వేల 169 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Rama Rao

Rama Rao

Next Story