Nellore: రగులుతున్న అసంతృప్తి

Nellore: నెల్లూరులో రాజకీయ వేడి రాజుకుంది.

Arun Chilukuri
Published on: 14 April 2022 8:58 PM IST
Group Politics In Nellore YSRCP
X

Nellore: రగులుతున్న అసంతృప్తి

Nellore: నెల్లూరులో రాజకీయ వేడి రాజుకుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గంలో తనకు స్థానం దక్కలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇదివరకే కన్నీళ్లు పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని మొత్తం నేతలు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ఘాటైన వ్యాఖ్యలే చేశారు.

కాకానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనడం పార్టీలో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి సజ్జాపురంలో భోజన సమయంలో ఓ నివాసంలో భేటీ అవడం కాక రేపుతోంది. భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి వారిద్దరూ పతాకస్థాయిలో చర్చించుకున్నట్లు సమాచారం. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఈ చర్చల్లో ఉండడం విశేషం. వీరి భేటీతో నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలు హాట్ టాపిగ్గా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story