AP BJP: వీర్రాజుకు వీడ్కోలు? కన్నాకు ఆహ్వానాలు?

Group Politics in AP BJP  Somu Veerraju vs Kanna Lakshmi
x

AP BJP: వీర్రాజుకు వీడ్కోలు? కన్నాకు ఆహ్వానాలు?

Highlights

AP BJP: ఏపీ బీజేపీలో ముసలం పుడుతోందా? అది అధ్యక్షుడికి కొత్త చిక్కులు తెప్పిస్తోందా?

AP BJP: ఏపీ బీజేపీలో ముసలం పుడుతోందా? అది అధ్యక్షుడికి కొత్త చిక్కులు తెప్పిస్తోందా? రాజకీయ సమీకరణాల నడుమ అధ్యక్షుడిగా ఏరికోరి మరి నియమిస్తే కొందరు నేతలు ఆయన ఆదేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారా? ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీని బలోపేతం చేయాలని వడివడిగా అడుగులు అడుగులు వేస్తున్న వేళ తిరుపతి సభ ఇచ్చిన సందేశమేంటి? తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సోము వీర్రాజు తర్వాత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణే అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఏపీ కమలంలో పైకి కనిపించని ఆ కొత్త కోణమేంటి?

ఏపీలో అధికార పార్టీ వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీలకు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న కమలం పార్టీ రాష్ట్రంలో బలోపేతం అవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోందట. తిరుపతిలో జరిగిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభాసాక్షిగా ఈ విషయాన్ని కమలనాథులు తేటతెల్లం చేసిందన్న చర్చ జరుగుతోంది. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను బీజేపీకి అనుకూలంగా మార్చుకునే క్రమంలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంతది. కాకపోతే, ఏపీ బీజేపీలోని కొందరు నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహార్తిస్తూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ప్రచారం జరగుతోంది.

ఏపీ బీజేపీలో ఓ చర్చ జరుగుతోంది. మరో కొత్త టాక్‌ వినిపిస్తోంది. అదే సోము వీర్రాజుకు ఇక ఉద్వాసన పలుకుతారని!!బీజేపీ హైకమాండ్‌ ఈపాటికే ఓ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం నడుస్తోంది. సోము నేతృత్వంలో పార్టీ బలపడలేదన్న అసంతృప్తి అధిష్టానాన్ని వెంటాడుతోందని, ప్రజా సమస్యలపై పోరాటమే లేదన్న అంచనాతో ఉన్న కమలనాథులు తిరుపతి, బద్వేల్‌ పరాజయాలను వీర్రాజుకు వీడ్కోలు పలుకుతారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి కన్నా లక్ష్మీనారాయణను నియమించేందుకు ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తనపై ఎప్పుడైనా వేటు పడొచ్చన్న అంచనాతో ఉన్న వీర్రాజు ముందుగానే ఊహించి, తాను 2024 ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటన ఇచ్చి ఉంటారేమోనన్న ప్రచారం జరుగుతోంది. అయితే, వీర్రాజు ముందు అంతో ఇంతో పార్టీ పరువు నిలిపిన కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరో రెండు, మూడు పేర్లు పరిశీలించినప్పటికీ వారి కంటే కన్నాయే సమర్థుడని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.

గతంలో రెండేళ్ల పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన కన్నా తన హయాంలో బీజేపీ ఉనికిని కాపాడడంలో కొంతమేరకు సఫలీకృతులయ్యారన్న ఆ పార్టీ నేతల్లో ఉంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు మేలు జరిగేలా చూడాలని రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు ఈ మధ్య అమరావతి పరిరక్షణ ఉద్యమంటూ తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో అంతా తానై వ్యవహరించారు. బీజేపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాకున్నా కన్నానే హాజరై అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచారు. న్యాయం జరిగే వరకు రైతుల తరఫున పోరాటం చేస్తానని భరోసా ఇచ్చారు. దాంతో రాజధాని ప్రాంత రైతులు కూడా తొలుత బీజేపీ పట్ల సానుకూలత ప్రదర్శించారని కమలం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

అదీగాక, కన్నా తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కేడర్‌ను ఉత్తేజితం చేయడానికి కృషిచేశారన్న అభిప్రాయం ఉంది. అయితే ఆయనకు చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉందని, వైసీపీ సీనియర్‌ నేతలే గాక బీజేపీలోని కొందరు కోవర్టులు కూడా ఆరోపణలు గుప్పించారు. సరిగ్గా ఏడాది క్రితం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వీర్రాజు జగన్‌ సర్కారుపై పోరాటం మాట అటుంచితే, కనీసం సొంత పార్టీ బలోపేతానికి కనీస ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలున్నాయి. పనిచేసే వారిని పూర్తిగా అణచివేశారన్న విమర్శలు వీర్రాజుపై ఉన్నాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన జట్టుకట్టినా పార్టీ అభ్యర్థికి డిపాజిట్‌ దక్కకపోవడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించిందట. అందుకే వేటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది తెలియడంతో ఆయన ఇటీవలి కాలంలో రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నంటూ హడావుడి చేస్తున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

ఇదిలాఉంటే, బీజేపీలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడితో సంబంధం లేకుండా తెర వెనుక రాజకీయాలు చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు కొందరు బీజేపీ నేతలు. గత కొంతకాలంగా సోము నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలంతా ఇప్పుడు వ్యూహం మార్చి, కింది స్థాయిలో ఉన్న నేతలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి తన నాయకత్వానికి, పార్టీలో నేతలకు, కార్యక్రమాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేతల విషయంలో సోము వీర్రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, తన వారసుడిగా కన్నాను ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories