ప్రకాశం జిల్లా వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

ప్రకాశం జిల్లా వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
x
Highlights

వైసీపీ క్యాడర్ ప్రతి జిల్లాలో రోజుకొక గొడవ తో విసికి పోతున్నారు. ప్రభుత్వం ఒక ప్రక్క సంక్షేమ పథకాలు తో ప్రజలకు చేరువ అవడానికి నవరత్నాలు కురిపిస్తున్న అసలు అధికారంలోకి తీసుకు వచ్చిన క్యాడర్ లో మాత్రం అసలు ప్రశాంతత లేదు .

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి న నటి నుండి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ ప్రతి జిల్లాలో రోజుకొక గొడవ తో విసికి పోతున్నారు. ప్రభుత్వం ఒక ప్రక్క సంక్షేమ పథకాలు తో ప్రజలకు చేరువ అవడానికి నవరత్నాలు అమలు చేస్తున్నా.. అధికారంలోకి తీసుకు వచ్చిన క్యాడర్ లో మాత్రం అసలు ప్రశాంతత లేదని చెప్పే పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్నది రాష్ట్రంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న ప్రకాశం జిల్లాలో కుడా నేతలు మద్ద్య పోరు క్యాడర్ కి అగస్టులు గా మారింది అసలు ప్రకాశం జిల్లాలో వైసీపీ లో లొల్లి ఏంటి వాచ్ ది స్టోరీ.

రాష్ట్రంలో వైసీపీకి మంచి పట్టుఉన్న జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాల్లో 8 స్థానాల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. మరో 4 చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది.

ప్రకాశం జిల్లాలో వైసీపీ బలంగా ఉందని భావిస్తున్న తరుణంలో నేతల నిర్వాకం కార్యకర్తలకు తలనొప్పి తెచ్చిపెడుతుంది. వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధి బాధ్యతలు స్థానిక ఎమ్మెల్యేతో పాటు పార్టీలోని మరో నేతకు అవకాశం కల్పిస్తుండడంతో వర్గ విభేదాలు ఏర్పడుతున్నాయి. ఆధిపత్య పోరు కోసం రెండు వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయి. పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. దర్శి, చీరాల, కొండపీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది.

దర్శిలో మద్ది శెట్టి ఎంట్రీని ఎన్నికలనుండి గెలుపు వరకు ఆహ్వానించిన బూచెపల్లి తదనంతరం రోడ్డుశిలాఫలకాలతో మొదలైన వివాదం అనంతరం ప్లెక్సీలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా వీరి మద్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా విభేదాలు తారా స్థాయికి చేరాయి. నాయకుల మద్య నెలకొన్న వర్గపోరు రోడ్డుకెక్కి పంచాయితీలు పోలీసుల రచ్చబండకు చేరుతున్నాయి. ఇరువర్గాలు అధికార పార్టీ వారు కావడంతో ఏమి చేయలో ఏమి చెప్పాలో అర్ధం కాక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు.

ఇక చీరాలలోటీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరడంతో విభేదాలు ముదిరిపాకానపడ్డాయి. వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ కర్ణం బలరాం వైసీపీలోకి రాకను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.కర్ణం ఎప్పటికైనా టీడీపీనేనని నిజమైన వైసీపీ వర్గం తామేనంటూ చెబుతున్నారు. చీరాలలో ఏ కార్యక్రమం నిర్వహించినా విభేదాలు తారా స్తాయికి చేరి పరిస్థితులు ఘర్షణకు దారితీస్తున్నాయి.

దర్శి, చీరాలలో అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో తొలినుండి వైసీపీ జెండామోసిన వర్గం, ఎన్నికలకు ముందు పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన సదరు నాయకుని వర్గం. ఇతర పార్టీలనుండి కొత్తగా వైసీపీలోకి చేరిన ద్వితీయ శ్రేణి నాయక వర్గం ఇలా ఎవరికి వారు యమునా తీరులా మారింది.

అధికార పార్టీలో రెండు మూడు వర్గాలు ఏర్పడటంతో ఏ కార్యక్రమం నిర్వహించినా ఉదృక్తవాతావరణంవైపు దారి తీస్తున్నాయి. వీటిని చూసిన ప్రజలు నిత్యం ఈ ఘర్ణనలు గొడవలు ఏంట్రాబాబు తమకు తలనొప్పిగా మారాయని ఈసడించుకుంటున్నారు. ప్రకాశం జిల్లాపై సీఎం జగన్ దృష్టిసారించకపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్తితులు తప్పవని నాయకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories