విషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..

Groom Died: నంద్యాల జిల్లా వెలుగోడు మండలం బోయరేవులలో విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 25 Jun 2022 3:46 PM IST
Groom Dies Within Hours After Wedding in Nandyal
X

విషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..

Groom Died: నంద్యాల జిల్లా వెలుగోడు మండలం బోయరేవులలో విషాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో పెళ్లికొడుకు చనిపోయాడు. పెళ్లై 24 గంటలు కాకముందే పెళ్లికొడుకు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బోయరేవుల గ్రామానికి చెందిన శివకుమార్‌కు జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన శిరీషతో శుక్రవారం వివాహం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు.

ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శివకుమార్‌ కోసం వెతకడం ప్రారంభించారు. బోయరేవుల - మోత్కూరు గ్రామాల మధ్య రోడ్డుపై శివకుమార్‌ పడి ఉండడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. అతడిని హుటాహుటిన ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. శివకుమార్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దిగ్భ్రాంతికి గురైన పెళ్లికూతురు, ఆమె బంధువులు వెనక్కి వెళ్లిపోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story