Grandhi Srinivas: పవన్‌కు మతిస్థిమితం లేదు

Grandhi Srinivas: స్థానికుడినైన నన్ను తరిమికొట్టాలనడం హాస్యాస్పదం.. ప్రజా సేవ అనేది మా బ్లడ్‌లోనే ఉంది

Shekhar G
Published on: 13 March 2024 11:51 AM IST
Grandhi Srinivas Shocking Comments On Pawan Kalyan
X

Grandhi Srinivas: పవన్‌కు మతిస్థిమితం లేదు

Grandhi Srinivas: జనసేన చీఫ్ పవన్‌‌కల్యాణ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్‌కు మతిస్థిమితం లేదని.. కాపులు పవన్‌కు ఎందుకు దూరమయ్యారో ఆయనే చెప్పాలని నిలదీశారు. సొంత అన్న నాగబాబుకూ పవన్‌ అన్యాయం చేశాడని... అందుకే నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేశారన్నారు. తాను రౌడీనైతే తనపై ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా అని ప్రశ్నించారు. భీమవరం నుంచి పవన్‌ను ఇప్పటికే ప్రజలు తరిమికొట్టారని.. స్థానికుడినైన తనను తరిమికొట్టాలనడం హాస్యాస్పదమన్నారు. ప్రజా సేవ అనేది మా బ్లడ్‌లోనే ఉందన్నారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

Shekhar G

Shekhar G

Next Story