Srisailam: మహాగౌరిగా దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి

Srisailam: శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Oct 2024 6:57 AM IST
Gowri Alankaram Enthrals Devotees at Srisailam Andhra Pradesh
X

Srisailam: మహాగౌరిగా దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి

Srisailam: శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వైభవంగా ఎనిమిదో రోజు భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అత్యంత శాంతమూర్తిగా కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికగా అమ్మవారు మహాగౌరిగా అలంకరించారు. పలురకాల పూలతో, బిల్వదళాలతో శాస్త్రోక్తంగా మంగళవాయిద్యాల నడుమ సుగంద ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులిచ్చారు.

అనంతరం స్వామి, అమ్మవార్లకు నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. పూజలు అయిన తర్వాత అకాల వర్షంతో ఆలయ పురవీధుల్లో జరగాల్సిన గ్రామోత్సవం నిలుపుదల చేసినట్లు ఈవో పెద్దిరాజు ప్రకటించారు. దసరా మహాత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story