వెయ్యి కాదు.. ఐదు వేలు ఇవ్వాలి : చంద్రబాబు

వెయ్యి కాదు.. ఐదు వేలు ఇవ్వాలి : చంద్రబాబు
x
Chandhrababu(file photo)
Highlights

క‌రోనా వైర‌స్ వ‌ల్ల‌న ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రూ బాధ‌ప‌డుతున్నార‌ని టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు అన్నారు. మన రాష్ట్రంలో ఒక్క వారంలో అత్యధికంగా క‌రోనా పెరిగింద‌ని అన్నారు.

క‌రోనా వైర‌స్ వ‌ల్ల‌న ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రూ బాధ‌ప‌డుతున్నార‌ని టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు అన్నారు. మన రాష్ట్రంలో ఒక్క వారంలో అత్యధికంగా క‌రోనా పెరిగింద‌ని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే క‌రోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయ‌ని చంద్ర‌బాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వారంలో 62 శాతంకరోనా వైరస్‌ కేసులు పెరిగాయని చంద్ర‌బాబు ఆందోళన వ్యక్తంచేశారు. హైద‌రాబాద్ లోని ఆయ‌న నివాసంలో మీడియాతో మాట్లాడారు. క‌రోనా ప్ర‌భావంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయ‌ని అన్నారు.

ప్రధాని మోదీ పిలుపుకు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై సంఘీభావం చెప్పారు. మనం పరిశుభ్రంగా ఉంటూనే మ‌న‌ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. గత వారం రోజుల్లో మన దేశంలో కరోనా కేసులు పెరిగాయి. ప్రభుత్వాలు బాధ్యతగా వ్య‌వ‌హ‌రించాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పివారిని మరింత అప్ర‌మ‌త్తం చేయాలి. ప్రజలు కూడా ప్రభుత్వాల సూచనలు పాటించాలి. సామాజిక‌ దూరం పాటించాలి. మ‌తప‌ర‌మైన, రాజ‌కీయ ప‌ర‌మైన స‌మావేశాల‌ను వాయిదా వేసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

కరోనా వైరస్ భయం అవ‌స‌రం లేదు జాగ్ర‌త్తాలు తీసుకుంటే చాలు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం సరికాదు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.. ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలి. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.

క‌రోనా కేసులు పేరిగే అవ‌కాశం ఉంది. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేస్తే కేసులు బయటపడతాయి. వాటికి అనుగుణంగా వెంటిలేటర్లు ఉంచాలి. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేయాలి, ఆక్వా రైతుల‌ను ప్ర‌భుత్వాలు అదుకోవాల‌ని చంద్ర‌బాబు అన్నారు.

రాష్ట్రంలో పరిస్థితి భ‌యంక‌రంగా ఉంది. కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేద ప్రజలను ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాయి. ఏపీలో పేదలకు తొలివిడతగా కనీసం 5వేల రూపాల‌య‌లు ఇవ్వాలి, రాష్ట్రంలో రూ.1000 నగదును వైసీసీ అభ్య‌ర్థులు పంచ‌డం ఏంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories