Gorantla Madhav: కడిగిన ముత్యంలా బయటకు వస్తా..

Gorantla Madhav Respond on Morphing Video
x

Gorantla Madhav: కడిగిన ముత్యంలా బయటకు వస్తా..

Highlights

Gorantla Madhav: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు.

Gorantla Madhav: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. తనదిగా ప్రచారం అవుతున్న వీడియో ఫేక్ వీడియో అని తాను ముందే చెప్పానన్నారు. ఈ వీడియోను పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. వీడియో వచ్చాక కూడా తన పనులు తాను చేసుకున్నానని ఆయన వెల్లడించారు. వీడియోపై న్యాయపరంగా చర్యలుంటాయన్నారు. వీడియోను సృష్టించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. తనపైనే ఈ వీడియో ఎందుకు సృష్టించారన్న విషయాన్ని వీడియోను అప్‌లోడ్ చేసిన వారినే అడగాలన్నారు. ఈ వ్యవహారంలో తాను కడిగిన ముత్యంలా బయటపడతానని ఎంపీ గోరంట్ల మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ వీడియో సృష్టించారని ఎంపీ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories