నంద్యాల జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌

*రాత్రి సమయంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు చివరి బోగీలు

Rama Rao
Published on: 22 Oct 2022 10:45 AM IST
Goods Train derailed near Dhone Railway Station
X

నంద్యాల జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌

Dhone Railway Station: నంద్యాల జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో హైదరాబాద్‌కు వెళ్తున్న గూడ్స్‌ రైలు నిన్న రాత్రి పట్టాలు తప్పింది. ఖాళీ డీజిల్‌ ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్‌ రైలు చివరి బోగీలు పట్టాలు తప్పి సుమారు 200 మీటర్లకు పైగా ప్రయాణించింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలును పరిశీలించారు. ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారు. మరోవైపు పట్టాలపై గూడ్స్ రైలు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ‎

Rama Rao

Rama Rao

Next Story